Header Banner

ట్రంప్ మరో సంచలనం.. యుద్ధం వద్దు ఒప్పందమే ముద్దు అని లేఖ! ఈ అణు ఒప్పందంపై చర్చలు..

  Sat Mar 08, 2025 07:00        U S A

ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీకి.. అమెరికా అధ్యక్షుడు లేఖ రాయడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇరాన్‌తో అణు ఒప్పందం గురించి చర్చలు జరపాలని కోరుకుంటున్నట్లు గురువారం రాసిన ఆ లేఖలో పేర్కొన్నట్లు.. శుక్రవారం ఫాక్స్ బిజినెస్ నెట్వర్క్ బ్రాడ్‌కాస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వయంగా డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. అయితే ఈ అణు ఒప్పందంపై చర్చలకు ఇరాన్ అంగీకరిస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇరాన్ చర్చలు జరుపుతారని తాను ఆశిస్తున్నానని.. ఎందుకంటే ఇది ఇరాన్‌కు చాలా మంచిదని ట్రంప్ తెలిపారు. ప్రస్తుతం ఇరాన్ ముందు రెండు మార్గాలు మాత్రమే ఉన్నాయని.. అవి సైన్యం లేదా ఒప్పందం చేసుకోవడమేనని పేర్కొన్నారు. తాను మాత్రం ఒప్పందానికే ప్రాధాన్యం ఇస్తానని డొనాల్డ్ ట్రంప్ తేల్చి చెప్పేశారు. ఎందుకంటే ఇరాన్‌ను దెబ్బతీయాలని అమెరికా అనుకోవడం లేదని.. అందుకే చర్చలు జరుపుతారని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఈ అణు ఒప్పందంపై చర్చలు ఇరాన్‌కు చాలా ప్రయోజనకరమని డొనాల్డ్‌ ట్రంప్‌ తెలిపారు.

 

ఇది కూడా చదవండి: అమెరికాను వణికిస్తున్న భారీ తుఫాన్.. ఎగిరిపోతున్న ఇళ్ల పైకప్పులు.! కొనసాగుతున్న టోర్నడోల విధ్వంసం!

 

అయితే ఇరాన్‌ మరిన్ని అణ్వాయుధాలను అభివృద్ధి చేయకుండా నిలువరించేందుకు అమెరికా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ ఒప్పందం అంశాన్ని తెరపైకి తెచ్చినట్లు అర్థం అవుతోంది. అయితే ఇదే అంశంపై ఇటీవల మాట్లాడిన డొనాల్డ్ ట్రంప్‌.. అణ్వాయుధాల పెంపును నిరోధించేందుకు గాను ఇరాన్‌తో ఒప్పందం చేసుకోవాలని అనుకుంటున్నట్లు చెప్పారు. ఇలా ప్రకటించిన కొన్ని రోజుల్లోనే తాజాగా ఇరాన్ సుప్రీం లీడర్‌కు లేఖ రాయడం గమనార్హం. ఇదిలాఉంటే ఇరాన్‌తో గతంలో అణు ఒప్పందం చేసుకున్న అమెరికా.. డొనాల్డ్ ట్రంప్‌ తొలిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 2018లోనే ఆ ఒప్పందం నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. అయితే అప్పుడు ఒప్పందం నుంచి బయటికి వచ్చిన ట్రంప్.. ఇప్పుడు తానే కావాలని ఒప్పందం చేసుకోవాలని లేఖ రాయడం తీవ్ర ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు ఇరాన్ అణు కార్యక్రమం చుట్టూ ఉన్న పరిస్థితిని పరిష్కరించడానికి అంతర్జాతీయ ప్రయత్నాలను రష్యా, ఇరాన్ చర్చించాయి. ఇరాన్ రాయబారి కజెం జలాలీతో.. రష్యా డిప్యూటీ విదేశాంగ మంత్రి సెర్గీ ర్యాబ్కోవ్ చర్చించారని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది.

 

ఇది కూడా చదవండి: వైసీపీకి మరో భగ్గుమనే షాక్! కొడాలి నానికి బిగుస్తున్న ఉచ్చు.. రంగంలోకి దిగిన ఏపీ పోలీసులు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నన్ను మేడం అని పిలవొద్దు.. నేను మీ భువనమ్మను.! గ్రామస్తులతో ముఖాముఖి కార్యక్రమంలో..

 

మంత్రి ప్రసంగంతో సినిమా చూపించారు.. RRR ప్రశంస! నోరు ఎత్తని వైసీపీ.. బుల్లెట్ దిగిందా? లేదా?

 

ఏపీ మహిళలకు ఎగిరి గంతేసే న్యూస్.. ప్రభుత్వ ఆటోలు, ఎలక్ట్రిక్ బైక్‌లు! రాష్ట్రంలోని 8 ప్రధాన నగరాల్లో..

 

బోరుగడ్డ అనిల్‌ పరారీలో సంచలనం.. ఫేక్ సర్టిఫికెట్ డ్రామా వెలుగులోకి! పోలీసుల దర్యాప్తు వేగం!

 

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై బిగ్ అప్డేట్.. ఈ కండిషన్ వర్తిస్తుంది, ఆ ఛాన్స్ లేదు!

 

ట్రంప్ మరో షాకింగ్ నిర్ణయం.. ఆ వీసాపై అమెరికా వెళ్లిన వారంతా.! మళ్లీ లక్ష మంది భారతీయులకు బహిష్కరణ ముప్పు.?

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #USA #AmericaNews #USAPolice #USAPoliceNewdeathsentence #deathsentence #Nitrogengas #Nitrogengasdeathsentence